మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు మేలు జరిగేలా గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ రాష్ట్రంలో అమలు చేసి, పునరుద్ధరిస్తామన్నారు. ఇందుకోసం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మంగళవారం జరిగిన రైతునేస్తం కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రతా పథకం కింద రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్ర రైతులు దాదాపు రూ. 8000 కోట్లు నష్టపోయారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుండి వచ్చే నిధులను పూర్తిగా సద్వినియోగం చేసుకోనుంది. మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో 100 మిల్లెట్స్ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని తుమ్మల తెలిపారు.