ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె జూ ఏ తుపాకీతో కాల్చుతున్న అరుదైన ఫోటోను శనివారం విడుదల చేయడంతో వారసత్వంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. కిమ్ జూ ఏను భవిష్యత్ నాయకురాలిగా తీర్చిదిద్దుతున్నారనే ఊహాగానాలు ఉన్నాయి. ఈ చిత్రాన్నికొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది. షూటింగ్ రేంజ్‌లో రైఫిల్‌తో లక్ష్యాన్ని గురి చేస్తూ జూ ఏ కనిపించింది. ఇటీవల జరిగిన సైనిక పరేడ్‌లలోనూ ఆమె పాల్గొనడం రాజకీయ ప్రాధాన్యతను సూచిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు
కిమ్ జాంగ్ ఉన్ కుమార్తె తుపాకీతో శిక్షణ… వారసత్వంపై ఊహాగానాలు
Published on: 📅 28 Feb 2026, 09:09 AM
Reporter: 🖊 Kiran Rao
>
>
>