ranji trophy final jammu kashmir vs karnataka day5

రంజీ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ ఆధిపత్యం… తొలి టైటిల్‌కు అడుగు దూరం

Published on: 📅 28 Feb 2026, 09:50 AM
Reporter: 🖊 Suresh Reddy

జమ్మూ కాశ్మీర్ - కర్ణాటక మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో జమ్మూ కశ్మీర్ స్పష్టమైన ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 584 పరుగులు చేసిన జేకే, శుభమ్ పుండీర్ శతకం (121)తో బలమైన స్కోర్ నమోదు చేసింది. బౌలింగ్‌లో ఔకిబ్ నబీ ఐదు వికెట్లు తీసి కర్ణాటకను 293కే కట్టడి చేశాడు. మయాంక్ అగర్వాల్ (160) శతకం వృథా అయింది. ప్రస్తుతం 480కుపైగా లీడ్‌తో జమ్మూ కశ్మీర్ తొలి టైటిల్‌కు అంచుల వద్ద నిలిచింది

Sponsored