అర్ధరాత్రి

అర్ధరాత్రి నుంచే ఓటీటీలో ‘రాజాసాబ్’ స్ట్రీమింగ్

Published on: 📅 06 Feb 2026, 06:01

ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కిన హారర్ ఫాంటసీ మూవీ ‘రాజాసాబ్’ అర్ధరాత్రి నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. గత నెల 9న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. విడుదలైన 28 రోజుల్లోనే ఓటీటీకి రావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా, నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్ కీలక పాత్రల్లో నటించారు.

Sponsored