మచిలీపట్నం పోర్టును NH-216 జంక్షన్‌కు అనుసంధానించే 6 లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ ప్రాజెక్టుతో పోర్టు నుంచి జాతీయ రహదారికి సరుకు రవాణా మరింత వేగవంతం అవుతుందని తెలిపారు. ఈ రోడ్డు పూర్తయితే లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గడంతో పాటు వ్యాపార కార్యకలాపాలకు ఊతం లభించనుంది. ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చిన గడ్కరీకి మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు.