పార్లమెంట్‌లో

పార్లమెంట్‌లో ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ సవరణ బిల్లు ఆమోదం

Published on: 📅 17 Feb 2026, 06:53

పార్లమెంట్ ఇరుసభలు ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ (సవరణ) బిల్లు–2026ను గురువారం ఆమోదించాయి. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మండవియా రాజ్యసభలో మాట్లాడుతూ పాత చట్టాల రద్దుపై స్పష్టత కల్పించేందుకే ఈ సవరణ తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో రాజ్యసభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్‌పై జరిగిన చర్చకు సమాధానమిచ్చారు. లోక్‌సభలో అయితే విపక్ష నిరసనలతో సభ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. బడ్జెట్ సమావేశాల తొలి విడత రేపటితో ముగియనుంది

Sponsored