ఇండియా

ఇండియా AI ఎక్స్‌పో 2026లో ప్రధాని మోదీ సందడి

Published on: 📅 17 Feb 2026, 06:59

న్యూఢిల్లీ భారత్ మండపంలో జరుగుతున్న ఇండియా AI ఇంపాక్ట్ ఎక్స్‌పో 2026ను ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. వివిధ AI పావిలియన్లను పరిశీలిస్తూ స్టార్టప్‌లు, పరిశోధకులు, టెక్ సంస్థల ప్రతినిధులతో ఆయన చర్చించారు. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు జరుగనున్న ఈ సమ్మిట్ గ్లోబల్ సౌత్‌లో తొలి అంతర్జాతీయ AI సదస్సుగా గుర్తింపు పొందింది. 70,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 10 అరేనాల్లో జరుగుతున్న ఎక్స్‌పోలో పలు దేశాలు, అంతర్జాతీయ భాగస్వాములు పాల్గొంటున్నారు. AI రంగంలో భారత సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటే వేదికగా ఇది నిలుస్తోంది.

Sponsored