శనైశ్చరుడు విష్ణు భక్తుడిగా ప్రసిద్ధి కావడంతో మాఘమాసంలో వచ్చే శని త్రయోదశిని అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే దానాలు, పరిహారాలు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. సాయంత్రం 5.15 నుంచి 5.45 గంటల మధ్య శివునికి అభిషేకం చేస్తే శని పీడలు తగ్గుతాయని విశ్వాసం. గుడికి వెళ్లలేని వారు ఇంట్లోనే పడమర దిశగా నువ్వుల నూనెతో ఎనిమిది ఒత్తులను కలిపి దీపం వెలిగించుకోవాలని సూచిస్తున్నారు. ఈ విధంగా భక్తితో చేసిన ప్రార్థనలు శుభఫలితాలను అందిస్తాయని భక్తుల నమ్మకం.