మార్చి 3న చంద్రగ్రహణం సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గ్రహణం మధ్యాహ్నం 3:20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:47 గంటలకు ముగియనుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణానికి ఆరు గంటల ముందే ఆలయాన్ని మూసివేయనుండటంతో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తారు. అనంతరం ఆలయ శుద్ధి, పుణ్యహవచనం నిర్వహించి రాత్రి 8:30 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.