ఏపీలోని

ఏపీలోని ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరిక

Published on: 16-09-2025

ఏపీలో వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. అల్పపీడనం,ద్రోణి ప్రభావంతో ఇవాళ చిత్తూరు, కడప, అన్నమయ్య, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది' అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మంగళ, బుధవారాల్లో రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.

Sponsored