బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడింది. అది ఇవాళ బంగ్లాదేశ్‌కి దగ్గరగా ఉంటుంది. కానీ.. ఈ రోజు రాత్రి అయ్యేటప్పటికి.. ఒడిశాకి దగ్గరగా వచ్చేలా ఉంది. ఆదివారం నాటికి ఒడిశా, విశాఖపట్నానికి దగ్గర్లో.. భారీగా సముద్రంలో ఉండేలా కనిపిస్తోంది. అది ఎంత పెద్దగా ఉంటే, అంతలా మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతానికి అది ఆవర్తనంగానే ఉంది. ఇంకా అల్పపీడనం అవ్వలేదు. అది 24 నాటికి అల్పపీడనం అవ్వొచ్చు అని భారత వాతావరణ శాఖ చెప్పింది.
ఏపీకి అతి భారీ వర్ష సూచన, తెలంగాణకి భారీ వర్ష సూచన.. నేటి వాతావరణం రిపోర్ట్!
Published on: 19-07-2025