హైదరాబాద్

హైదరాబాద్ పార్కులో కాల్పుల కలకలం.. దుండగుల ఫైరింగ్‌లో ఒకరు స్పాట్ డెడ్

Published on: 15-07-2025

మళ్లీ హైదరాబాద్‌లో కాల్పుల మోత సామాన్య ప్రజలకు దడ పుట్టిస్తోంది. ఉదయాన్నే వాకింగ్ చేయడానికి పబ్లిక్ పార్కుకు వెళ్లిన సమయంలో దుండగులు షడన్‌గా వచ్చి కాల్పులు జరపడంతో అంతా షాక్ అయ్యారు. ఈఘటన హైదరాబాద్‌ మలక్‌పేటలో చోటుచేసుకుంది. శాలివాహననగర్ పార్కులో వాకింగ్ చేస్తున్న వారిపై ఆగంతకులు కాల్పులు జరిపారు. దుండగుల కాల్పుల్లో చందు నాయక్ రాథోడ్ అనే వ్యక్తి చనిపోయాడు. చందు నాయక్ మరణించడంతో ఆగంతకులు అక్కడి నుండి పారిపోయారు. తోటి వాకర్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Sponsored