ఏపీ గ్రూప్-1 పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నట్లు సమాచారం. బుధవారం జరిగిన విచారణలో కోర్టు ఆదేశాలకు లోబడి ఫలితాలు ప్రకటించవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. క్రీడా కోటకు సంబంధించిన కేసు పెండింగ్‌లో ఉన్నప్పటికీ, రిజర్వేషన్ రోస్టర్ కేసులో స్టే లేకపోవడంతో ఫలితాల విడుదలకు APPSC సిద్ధమైనట్లు తెలుస్తోంది. 2023 డిసెంబర్‌లో 81 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడగా, 2024 మార్చిలో ప్రిలిమ్స్, 2025 మేలో మెయిన్స్, జూన్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. అభ్యర్థుల్లో ఫలితాలపై భారీ ఉత్కంఠ నెలకొంది.