కోఠి

కోఠి SBI వద్ద కాల్పులు కలకలం: రూ.6 లక్షల దోపిడీ

Published on: 📅 31 Jan 2026, 09:52

హైదరాబాద్ కోఠిలోని SBI కార్యాలయం వద్ద దుండగులు కాల్పులకు తెగబడి కలకలం సృష్టించారు. ATMలో నగదు డిపాజిట్ చేయడానికి వచ్చిన రిషద్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతని వద్ద ఉన్న రూ.6 లక్షలను దుండగులు దోచుకున్నారు. కాల్పుల్లో రిషద్ కాలికి గాయమవడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని CCTV కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటనతో కోఠి ప్రాంతంలో భద్రతపై ఆందోళన నెలకొంది.

Sponsored