తెలుగుదేశం

తెలుగుదేశం పార్టీకి అశోక్ గజపతిరాజు రాజీనామా..!

Published on: 📅 19 Jul 2025, 08:26

కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల రెండు రాష్ట్రాలకు గవర్నర్లను, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించిన సంగతి తెలిసిందే. అందులో గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. ఈ నేపథ్యంలోనే అశోక గజపతిరాజు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పొలిట్ బ్యూరో మెంబర్ షిప్ కి రాజీనామా చేశారు.

Sponsored