న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL)లో 16 కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇవాళే చివరి తేదీ. పోస్టును బట్టి CA/ICWA, డిగ్రీ, MBA, BE/BTech, MSW, MA, MTech అర్హతతో పాటు సంబంధిత పని అనుభవం ఉండాలి. యంగ్ కన్సల్టెంట్‌కు గరిష్ఠ వయసు 30 ఏళ్లు, కన్సల్టెంట్‌కు 35, సీనియర్ కన్సల్టెంట్‌కు 45 ఏళ్లు నిర్ణయించారు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు హార్డ్ కాపీని ఫిబ్రవరి 10లోపు పంపాలి. మరిన్ని వివరాలకు www.nsilindia.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు