భారీ అంచనాల మధ్య మార్చి 19న విడుదలైన ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి వరుసగా ట్రెండింగ్‌లో కొనసాగుతూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా యాక్షన్, ఎమోషన్, కథ కలగలిపిన ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ స్పందనను అందుకుంది.
ఈ చిత్రంలో హీరోగా నటించిన రణ్‌వీర్ సింగ్‌కు మరో భారీ హిట్ దక్కింది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం కేవలం 15 రోజుల్లోనే రూ.1500 కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. అధికారిక సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రూ.1501 కోట్లకు పైగా వసూళ్లు సాధించగా, భారతదేశంలోనే రూ.1134 కోట్లు వచ్చినట్లు చిత్రబృందం వెల్లడించింది. ఇది ఈ మధ్యకాలంలో బాలీవుడ్‌లో అరుదైన రికార్డుగా మారింది.
ఈ సినిమా విజయంతో నటీనటులందరికీ భారీగా క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ‘ధురంధర్ 2’లో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాని బలోచ్ పాత్రలో నటించిన బిమల్ ఒబెరాయ్ ఇప్పుడు టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రంలో ఆయనకు కీలక పాత్ర దక్కింది. ఈ విషయాన్ని బిమల్ ఒబెరాయ్ స్వయంగా వెల్లడించగా, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇక ఈ సినిమా ప్రభావం ఇండస్ట్రీలో కూడా కనిపిస్తోంది. బాలీవుడ్ అగ్రహీరో ఆమిర్ ఖాన్ సైతం ఈ సినిమాను ప్రశంసిస్తూ, చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. ‘మీ కష్టానికి ఫలితం దక్కింది’ అంటూ ప్రత్యేకంగా స్పందించారు. అలాగే ఈ చిత్రంలో ఐబీ చీఫ్ పాత్రలో నటించిన మాధవన్ కూడా ఇటీవల థియేటర్‌లో సినిమా చూసి తన అనుభవాన్ని పంచుకున్నారు.
1500 కోట్ల దూకుడు..! ‘ధురంధర్ 2’ హిట్‌తో ఎన్టీఆర్ సినిమాలోకి బిమల్ ఎంట్రీ
3
Published on: 📅 03 Apr 2026, 03:55 PM
Reported by: 🖊
Jasmin Sk