రాష్ట్రంలోని ప్రభుత్వ, మోడల్ స్కూళ్లలో పది, అంతకుముందు తరగతులు చదువుతున్న విద్యార్థులకు నవంబరు నుంచి సాయంత్రం ప్రత్యేక శిక్షణ (స్పాట్స్) అందించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. పాత పద్ధతిలో సంక్రాంతి సెలవుల తర్వాత తరగతులు మొదలుపెడితే సమయం సరిపోవడం లేదని అభిప్రాయపడింది. సాయంత్రం 7 గంటల వరకూ స్పాట్స్ నిర్వహించి, భోజనం కూడా అందించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనంగా ఉంటుందని పేర్కొంది. ఇందుకోసం ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 ఖర్చు చేయాలని ప్రతిపాదించింది.