హైదరాబాద్ నగరంలో బాలానగర్ కిమ్స్ హాస్పిటల్ పరిధిలోని పద్మానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. సాయిలక్ష్మి అనే మహిళ తన రెండేళ్ల కవల పిల్లలను గొంతు నులిమి చంపి, ఆ తర్వాత మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సాయిలక్ష్మి స్వగ్రామం ఏలూరు జిల్లా నూజివీడు. భర్త అనిల్‌కుమార్‌తో గొడవలే ఈ ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.