'అఖండ

'అఖండ 2' కోసం మిశ్రా ద్వయం

Published on: 13-10-2025

'అఖండ 2' సినిమాకు సరికొత్త సంగీతం అందించేందుకు మిశ్రా సోదర ద్వయాన్ని రంగంలోకి దించారు. బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. మిశ్రా ద్వయం అందించే సంస్కృత శ్లోకాలు, వేదమంత్రాలు 'అఖండ 2' నేప‌థ్య సంగీతాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తాయని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

Sponsored