టాలీవుడ్‌కు ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకువచ్చిన దర్శకుడు, తెలుగు చలనచిత్ర పరిశ్రమను అంతర్జాతీయంగా అందలమెక్కించిన ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. నేడు ఆయన జన్మదినం సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సూపర్‌స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) ఒక స్పెషల్ ఫొటోతో రాజమౌళికి విషెస్ చెప్పారు. "ఇండస్ట్రీలో ఉన్న ఒకే ఒక్క దర్శకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తెరకెక్కించేవన్నీ అద్భుతాలే. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే రానుంది" అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం మహేశ్ #SSMB29 లుక్‌లో ఉండటంతో ఈ ఫొటో వైరల్ అవుతోంది.