కొండలు, గుట్టలను దృఢంగా చేసే ఈ పద్ధతి ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగిపడకుండా చేపట్టే ఆధునిక రక్షణ విధానం. ఈ పద్ధతిని ఉపయోగించి తిరుమల కనుమ దారుల్లో భద్రతా చర్యలు చేపట్టారు. దీనికోసం ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, భారీ రాళ్లకు బోల్టులు బిగించి, ఇనుప వల వేసి, దానిపై కాంక్రీటు పోసి పటిష్ఠం చేస్తున్నారు. ఇందుకోసం టీటీడీ మద్రాస్ ఐఐటీ నిపుణుల సాయం తీసుకుంటోంది. ఒక్క చెట్టూ తొలగించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.