ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేసి, విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా మానవీయ కోణంలో పనిచేయాలని స్పష్టం చేశారు. వర్ష సంబంధిత ఘటనల్లో మృతి చెందిన నలుగురి కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.వరద పరిస్థితిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో ఆయన శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.