బతుకమ్మ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులకు ప్రత్యేక కానుక అందించనుంది. ‘రేవంతన్న కానుక’ పేరుతో ఇందిరా మహిళా శక్తి పథకం కింద ప్రతి సభ్యురాలికి రెండు చేనేత చీరలు పంపిణీ చేయడానికి సిద్ధమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న మహిళలకు చీరలు ఇచ్చినా నాణ్యతపై విమర్శలు వచ్చాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది పంపిణీ నిలిపివేసింది. అయితే ఈసారి మంచి నాణ్యత కలిగిన చీరలను అందించాలనే నిర్ణయం తీసుకుంది. ఈ చీరల పంపిణీ కోసం ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున చేనేత రంగానికి ఆర్డర్లు ఇచ్చింది. దీంతో చేనేత కూలీలకు ఉపాధి.