ఏలూరు జిల్లాలో శ్రీగంధం చెట్ల దొంగతనాలకు చెక్ పడింది. కామవరపుకోట మండలం రత్నగిరి రైతు తమ్మినేని సూర్యచంద్ర వరప్రసాద్ తోటలో చెట్లు నరికేందుకు నలుగురు ప్రయత్నించగా రైతు అడ్డుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకుని నిందితులను అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి శ్రీగంధం కట్టెలు, కత్తులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ముఠా గత కొన్నేళ్లుగా ఏలూరు జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో కూడా శ్రీగంధం చెట్లను దొంగిలిస్తూ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.రైతులు ఊపిరి పీల్చుకుంటూ పోలీసుల చర్యను అభినందించారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.