తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై కోట్ల రూపాయల విలువైన ఛలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. గత ఏడాది డిస్కౌంట్ స్కీమ్‌తో 1.67 కోట్ల ఛలాన్లు క్లియర్ అవగా, 150 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈసారి కూడా ఇలాంటి రాయితీ వస్తుందేమో అని వాహనదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.