హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో మరో భారీ భూముల వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. నగరంలోని అత్యంత విలువైన ప్రాంతమైన రాయదుర్గం, గచ్చిబౌలిలో ఉన్న 18.67 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ ద్వారా వేలం వేయనుంది. ఒక ఎకరాకు ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించారు. ఈ వేలం ద్వారా కనీసం రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అక్టోబర్ 6న ఈ- వేలం ప్రక్రియ జరగనుంది. ఈ భూమి శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఉంది.