తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు ముగిశాయి. ఇక రేపటి నుంచి మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపటి నుంచి తుఫాన్‌గా ప్రభావం ప్రారంభమై.. మంగళ, బుధవారాల్లో మరింత ఎక్కువ వర్షపాతం పడే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 8 నుంచి 9 వరకు కురిసే వర్షాల దృష్ట్యా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిక జారీ చేశారు.
తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు కీలక హెచ్చరికలు.. 12 గంటల్లో..!
Published on: 08-09-2025