ఏపీలో

ఏపీలో ఇకపై వారికి కూడా ఉచితంగా సిలిండర్లు ఇస్తారు.. 23,912మందికి లబ్ధి

Published on: 05-09-2025

AP Free Gas Cylinder Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజనులకు శుభవార్త తెలిపింది. దీపం-2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లను అందించాలని నిర్ణయించింది. దీని ద్వారా 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.5.54 కోట్లు ఖర్చు చేయనుంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనుంది. లబ్ధిదారులు ఆధార్, రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ వివరాలతో రాయితీ పొందవచ్చు.

Sponsored