తెలంగాణలో భూముల ధరలు పెరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువను సవరించడానికి సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల, వెలుపల ఉన్న 20 మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ పరిధిలో మాత్రమే మార్కెట్ విలువ సవరణకు స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్రమంతటా భూముల మార్కెట్ విలువలను సవరించాలని నిర్ణయించినట్లు సమాచారం.