యాంకర్

యాంకర్ ఉదయభాను భావోద్వేగం.. నదిని బంధించలేరు.. సూర్యుడ్ని ఆపలేరు.. ఇకపై నేనే అవకాశాలిస్తా

Published on: 04-09-2025

యాంకర్ ఉదయభాను.. యాంకరింగ్‌లో ఆమె ఓ ట్రెండ్ సెట్టర్. తెలంగాణలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన ఉదయభాను.. 12 ఏళ్ల వయసులోనే యాంకర్‌గా మైక్ పట్టుకుంది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింబకా వంటి కార్యక్రమాలతో తనని తాను నిరూపించుకుని.. స్టార్ యాంకర్‌గా ఓ వెలుగు వెలిగింది. అలాంటి స్టార్ యాంకర్.. యాంకర్ల సిండికేట్‌కి బలైపోయి.. తనకి అవకాశాలు లేకుండా చేస్తున్నారంటూ గళం ఎత్తిన విషయం తెలిసిందే.

Sponsored