AP Disability Pension Cancelled Appeal: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లలో అనర్హులకు నోటీసులు జారీ చేసింది. అర్హులైన వారు అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. సీఎస్ విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, అర్హులందరికీ పింఛన్లు అందేలా చూడాలని ఆదేశించారు. నోటీసులు అందుకున్నవారు వెంటనే అప్పీల్ చేసుకోవాలని, లేకుంటే పింఛన్ నిలిపివేస్తామని ప్రభుత్వం తెలిపింది. అప్పీల్ చేసుకున్నవారికి సెప్టెంబర్ 1న పింఛన్ అందుతుంది. చివరి తేదీ సమీపిస్తుండటంతో వెంటనే అప్పీల్ చేసుకోండి!
ఏపీలో వారికి పింఛన్‌లు కట్.. సెప్టెంబర్ 1న డబ్బులు ఇవ్వరు.. వెంటనే ఇలా చేయండి
Published on: 30-08-2025