APSRTC Employees Payment Hiked: ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉద్యోగుల నైట్ అలవెన్స్‌ను పెంచడంతో పాటు ప్రమాద బీమా పరిహారాన్ని రూ. కోటి రూపాయలకు పెంచారు. అంతేకాకుండా, డబుల్ డ్యూటీ చేసే డ్రైవర్లు, కండక్టర్ల వేతనాలు పెంచారు. మహిళల ఉచిత ప్రయాణ పథకం ద్వారా నష్టపోయిన ఆటో డ్రైవర్ల కోసం కొత్త పథకాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు
ఏపీ ఉచిత బస్సు పథకం.. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కూడా గుడ్‌న్యూస్
Published on: 30-08-2025