తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఇటీవల జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లిని దూషించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై యంగ్ టైగర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. అనంతపురంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. క్షమాపణలు చెప్పకపోతే రోడ్డు మీద తిరగలేవంటూ హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేయాలని అభిమానులు నిర్ణయించుకున్నారు. మరోవైపు హీరో నారా రోహిత్ నెట్టింట వైరల్ అవుతున్న ఆడియోపై రియాక్ట్ అయ్యారు.
Nara Rohith: ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే బూతులు.. స్పందించిన నారా వారబ్బాయి
Published on: 26-08-2025