మళ్లీ దేశంలో భూప్రకంపనలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయి. హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత దాదాపు 3.2 గా ఉంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నివేదిక ప్రకారం జూలై 22న ఉదయం 6:08 గంటలకు 3.2 తీవ్రతతో భూకంప ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉందని చెబుతున్నారు.
ఫరీదాబాద్‌ను కుదిపేసిన భూకంపం.. తెల్లవారుజామున ఇళ్ళలోంచి జనం పరుగులు
Published on: 22-07-2025