massive russian crude oil shipments headed to india

రష్యా నుంచి భారత్‌కు భారీగా క్రూడాయిల్

Published on: 📅 06 Mar 2026, 03:33 PM
Reporter: 🖊 Kiran Rao

అమెరికా ఆంక్షల సడలింపుతో రష్యా నుంచి భారత్‌కు భారీగా ముడి చమురు రానుంది. సుమారు 1.5 కోట్ల బ్యారెళ్ల క్రూడాయిల్‌తో కూడిన 12కి పైగా ట్యాంకర్లు ఇప్పటికే భారత తీరానికి సమీపంలో ఉన్నట్లు సమాచారం. అవి వచ్చే వారం మన దేశ పోర్టులకు చేరుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ డేటా తెలిపింది. సింగపూర్ సమీపంలో ఉన్న మరో 8 నౌకలు కూడా త్వరలో భారత్‌కు రానున్నట్లు పేర్కొంది. అమెరికా నుంచి స్పష్టమైన సంకేతం రాకముందే రష్యా ట్యాంకర్లు భారత్ వైపు మళ్లినట్లు సమాచారం.

Sponsored