ఎనిమిదో తరగతి సామాజిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై అభ్యంతరకర విషయాలు ఉన్నాయనే వివాదం తీవ్రరూపం దాల్చింది. దీనిపై విచారణ చేసిన భారత సుప్రీంకోర్టు పుస్తక ముద్రణ, పునర్ముద్రణతో పాటు డిజిటల్ ప్రచారంపైనా సంపూర్ణ నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో విద్యా మంత్రిత్వ శాఖలు, ఎలక్ట్రానిక్ వేదికలకు లేఖ రాసి ఆ పుస్తక ప్రసారాన్ని వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా NCERT అభ్యంతరకర అంశాలపై క్షమాపణ తెలిపింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రేంద్రప్రధాన్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
ఎన్‌సీఈఆర్‌టీ పుస్తక వివాదం.. సుప్రీంకోర్టు ఆదేశాలతో డిజిటల్ ప్రచారానికి బ్రేక్
Published on: 📅 27 Feb 2026, 06:33 AM
Reporter: 🖊