హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,310 తగ్గి రూ.1,56,440కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 తగ్గి రూ.1,43,400గా నమోదైంది. అటు వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.2,80,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.