జేఈఈ

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 ఫలితాలు ఇవాళ విడుదల

Published on: 📅 16 Feb 2026, 08:36

National Testing Agency (NTA) ఇవాళ జేఈఈ మెయిన్ 2026 సెషన్–1 ఫలితాలను విడుదల చేయనుంది. ఫిబ్రవరి 12న ప్రకటించాల్సిన ఫలితాలు వాయిదా పడగా, ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్లు nta.ac.in, jeemain.nta.nic.inలో అందుబాటులో ఉంటాయి. జనవరి 21 నుంచి 29 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష జరిగింది. ప్రొవిజనల్ ఆన్సర్ కీపై అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ కీ విడుదల అవుతుంది. ఈ స్కోర్లు దేశవ్యాప్తంగా BE/BTech, BArch, BPlanning ప్రవేశాలకు ఉపయోగపడనున్నాయి. రీ-వాల్యుయేషన్‌కు అవకాశం లేదని NTA స్పష్టం చేసింది.

Sponsored