భారత్

భారత్ దెబ్బకు పాక్ 114కే ఆలౌట్.. టీవీ పగలగొట్టిన అభిమాని వీడియో వైరల్

Published on: 📅 16 Feb 2026, 08:31

టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రభాదాస స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత్ మరోసారి పాకిస్థాన్‌పై ఆధిపత్యం చాటింది. 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన పాక్ జట్టు కేవలం 114 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బౌలర్లు చెలరేగి 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. ఈ ఓటమిని తట్టుకోలేక ఓ పాకిస్థాన్ అభిమాని టీవీ పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విజయంతో భారత్ సూపర్-8 దశకు చేరింది.

Sponsored