ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడనివ్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విద్యుత్ కొనుగోలు ఖర్చును తగ్గించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక, పురపాలక, అటవీ, స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విభాగాల్లో నిబంధనలు సరళతరం చేయాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో తెలిపారు. పన్ను వసూళ్లు తగ్గకూడదని, వ్యాపారులను వేధించవద్దని స్పష్టంగా చెప్పారు.