ట్రంప్

ట్రంప్ నోబెల్ నామినేషన్‌పై పోలండ్–అమెరికా మాటల యుద్ధం

Published on: 📅 06 Feb 2026, 08:01

NRI

ట్రంప్‌ను నోబెల్ బహుమతికి నామినేట్ చేయాలని అమెరికా పంపిన ప్రతిపాదనలను పోలండ్ తిరస్కరించింది. అవార్డుకు ఆయన అర్హుడు కాదని పార్లమెంట్ స్పీకర్ జాజెస్టీ స్పష్టం చేశారు. దీనిని ట్రంప్‌పై అవమానంగా పేర్కొంటూ అమెరికా దౌత్యవేత్త టామ్ రోజ్ తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన పోలండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్, పరస్పర గౌరవం అవసరమని పేర్కొన్నారు. ఒకరినొకరు గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని, దౌత్యం ఎలా నిర్వహించాలో తమకు బాగా తెలుసని స్పష్టంగా కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు రెండు దేశాల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి.

Sponsored