ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరగనుందని సమాచారం. ఈ భేటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 3న జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఈ కేసులో అసలు సూత్రధారులను గుర్తించేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.