మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స అందించేందుకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మేడారంలో 50 పడకల ఆస్పత్రి, జాతర ప్రాంగణంలో 30 మెడికల్ క్యాంపులు, రూట్లలో 42 క్యాంపులు ఏర్పాటు చేశారు. 544 మంది డాక్టర్లు సహా 3,199 మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి, 38 అంబులెన్సులు, 40 బైక్ అంబులెన్సులను సిద్ధం చేశారు. భక్తులకు అత్యవసర వైద్య సేవలు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ కూడా ఏర్పాటు చేశారు.