ప్రభాస్

ప్రభాస్ ‘రాజాసాబ్’ వసూళ్లకు గట్టి దెబ్బ

Published on: 22-01-2026

ప్రభాస్, మారుతి కాంబినేషన్లో తెరకెక్కిన ‘రాజాసాబ్’ వసూళ్లు దారుణంగా పడిపోయాయి. నిన్న దేశవ్యాప్తంగా థియేటర్లలో రూ.0.48 కోట్లు (15 శాతం ఆక్యుపెన్సీ) వసూలు చేసిందని sacnilk తెలిపింది. తొలి వారం రూ.130 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించగా, 13 రోజుల్లో మొత్తం రూ.141.98 కోట్లు వచ్చాయని వెల్లడించింది. ఇప్పటివరకు ఈ మూవీ కేవలం 55 శాతం మాత్రమే రికవరీ చేసిందని సినీ వర్గాలు తెలిపాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Sponsored