ఇందిరమ్మ

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిగ్ అప్డేట్.. ప్రభుత్వం ఇచ్చిన ఊహించని గుడ్ న్యూస్!

Published on: 21-01-2026

ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరు వినగానే లక్షలాది పేద కుటుంబాల్లో ఆశలు చిగురిస్తాయి. సొంత ఇల్లు కలను నిజం చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఈ పథకానికి సంబంధించిన కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ వారం రికార్డు స్థాయిలో 23 వేల మంది లబ్ధిదారులకు రూ.261.51 కోట్లు చెల్లించినట్లు హౌసింగ్ ఎండీ గౌతం వెల్లడించారు. అలాగే, మార్చి నాటికి లక్ష ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి తదుపరి దశను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Sponsored