లగ్జరీ

లగ్జరీ హోటళ్లతో విశాఖకు అంతర్జాతీయ గుర్తింపు

Published on: 20-01-2026

స్టార్ హోటళ్లు, లగ్జరీ రిసార్టులతో విశాఖ టూరిస్ట్ హబ్‌గా మారుతోంది. నగరంలో ₹1552 కోట్ల పెట్టుబడులతో 10 హోటళ్లు, రిసార్టులు నిర్మాణంలో ఉన్నాయి. ITC ₹328 కోట్లతో హోటల్ నిర్మిస్తుండగా, అన్నవరం బీచ్, విమానాశ్రయానికి సమీపంలో Oberoi 7-స్టార్ లగ్జరీ రిసార్ట్ అభివృద్ధి చేస్తోంది. వరుణ్ గ్రూపు ప్రాజెక్టుతో ఉద్యోగాలు పెరిగి, పర్యాటకం జోరందుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో నగర ఆర్థికాభివృద్ధికి బలం చేకూర్చి అంతర్జాతీయ స్థాయిలో విశాఖను ప్రత్యేకంగా నిలిపే దిశగా ముందుకు నడిపిస్తాయని అంచనా వేస్తున్నారు అని చెప్పారు.

Sponsored