PSLV వరుసగా రెండు ప్రయోగాల్లో (C61, C62) మూడో దశలోనే విఫలమవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈ దశలో ఘన ఇంధనం మండే సమయంలో థ్రస్ట్ తగ్గినా లేదా నాజిల్ కంట్రోల్ వ్యవస్థలో లోపం తలెత్తినా రాకెట్ దారి తప్పే అవకాశం ఉంటుంది. ఇదే కారణంతో C61 విఫలమైనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు C62లోనూ అదే దశలో సమస్య రావడంతో పాత తప్పిదాన్ని సరిదిద్దడంలో విఫలమయ్యారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.