సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లో ఘనంగా ఉత్సవాలు నిర్వహించనున్నారు. జనవరి 16 నుంచి 18 వరకు పరేడ్ గ్రౌండ్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరగనుంది. పరేడ్ గ్రౌండ్, బతుకమ్మ కుంట, నల్ల చెరువు ప్రాంతాల్లో పతంగులు, మిఠాయిల పండుగలు ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో ప్రత్యేక డ్రోన్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు.