అమరావతిలో రెండో విడత భూసమీకరణ నేటి నుంచి ప్రారంభమవుతోంది. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల (వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి) రైతుల నుంచి 16,666 ఎకరాలను CRDA సమీకరించనుంది. ప్రభుత్వం ఈ భూములను ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, IRR కోసం ఉపయోగించనుంది. భూములు ఇచ్చిన రైతులకు స్థలాలను త్వరగా అప్పగిస్తామని హామీ ఇచ్చింది